అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న పర్ఫెక్ట్‌ మూవీ

ABN , Publish Date - May 26 , 2024 | 06:00 AM

కార్తీకేయ గుమ్మడికొండ, ఐశ్వర్య మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్‌ రెడ్డి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు....

అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న పర్ఫెక్ట్‌ మూవీ

కార్తీకేయ గుమ్మడికొండ, ఐశ్వర్య మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్‌ రెడ్డి ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోందీ సినిమా. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను లాంచి చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ మాట్లాడుతూ ‘‘ఒక కామన్‌ మ్యాన్‌ అసాధారణ సమస్యలో ఇరుక్కుంటే అందులో నుంచి ఎలా బయటపడ్డాడో ఇందులో ఆసక్తికరంగా చూపిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘నేనే ఎప్పటినుంచో ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న సినిమాలో నటిద్దామనుకుంటన్నా. ఇప్పటికి కుదిరింది. నా కెరీర్‌కు బూస్ట్‌నిచ్చే పర్ఫ్‌క్ట్‌ మూవీ ఇది’’ అని హీరో కార్తీకేయ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: సత్య.జి, సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: రధన్‌, కో ప్రొడ్యూసర్‌: అజయ్‌కుమార్‌ రాజు

Updated Date - May 26 , 2024 | 06:00 AM