నాన్‌స్టాప్‌ ఎంటర్టైనర్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:51 AM

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ నటించిన చిత్రం ‘ఓం భీం బుష్‌’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సునీల్‌ బలుసు నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ‘ఓం భీం బుష్‌’ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది...

నాన్‌స్టాప్‌ ఎంటర్టైనర్‌

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ నటించిన చిత్రం ‘ఓం భీం బుష్‌’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సునీల్‌ బలుసు నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ‘ఓం భీం బుష్‌’ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నాన్‌స్టాప్‌ ఎంటర్టైన్‌మెంట్‌ను అందివ్వాలని చేసిన ప్రయత్నానికి సక్సెస్‌ లభించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ ‘‘సమ్మర్‌లో మంచి ఎంటర్టైన్‌మెంట్‌ కావాలంటే ఈ చిత్రాన్ని చూడండి’’ అని అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది’’ అన్నారు. రాహుల్‌ రామకృష్ణ మాట్లాడుతూ ‘‘కష్టే ఫలి అంటారు. మేము పడిన కష్టానికి తగ్గ హిట్‌ ప్రేక్షకులు ఇచ్చారు’’ అని చెప్పారు. దర్శకుడు హర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘థియేటర్స్‌లో సినిమా చూసిన వారు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.

Updated Date - Mar 24 , 2024 | 02:51 AM