సరికొత్తగా నరుడి బతుకు
ABN , Publish Date - Oct 20 , 2024 | 02:07 AM
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధురెడ్డి నిర్మించారు....
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధురెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 25న ఈ చిత్రం విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘శివ, నితిన్ ప్రసన్న నటన బావుంది. ఈ మూవీ సరికొత్తగా ఉండబోతోంది’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘నరుడి బ్రతుకు నటన’ చిత్రబృందాన్ని చూసినప్పుడు నాకు నా పాత రోజులు గుర్తుకొచ్చాయి. నేను కెరీర్ ఆరంభంలో నిర్మించిన కొన్ని మంచి చిత్రాలను అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించగలిగాను కానీ థియేటర్లలో విడుదల చేయలేకపోయాను. అందుకే ఒక మంచి సినిమాను తీసిన ఈ నిర్మాతలకు సాయంచేసేందుకు ముందుకొచ్చాను’ అన్నారు. శివ, నితిన్ ప్రసన్న నటన సినిమాకు ప్రత్యేకాకర్షణ అని రిషికేశ్వర్ తెలిపారు. ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం, ప్రేక్షకులు ఆదరించాలి అని సింధురెడ్డి కోరారు.