కొత్త తరహా పాత్ర

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:15 AM

తమిళ హీరో ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా...

తమిళ హీరో ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌లో దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రను ధనుష్‌ ఇందులో పోషిస్తున్నారు. ఆయన పెర్ఫార్మెన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుందని మేకర్స్‌ చెప్పారు. హై బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సోషల్‌ డ్రామాలో రష్మిక కథానాయిక. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహనరావు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 04:15 AM