పాత కాంబోలో కొత్త చిత్రం

ABN , Publish Date - May 10 , 2024 | 01:28 AM

హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించబోయే కొత్త చిత్రం ఖరారైంది. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. గతంలో విజయ్‌తో ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ఖుషి’ చిత్రాలను నిర్మించిన...

పాత కాంబోలో కొత్త చిత్రం

హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించబోయే కొత్త చిత్రం ఖరారైంది. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. గతంలో విజయ్‌తో ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ఖుషి’ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్తాయిలో నిర్మిస్తోంది. అలాగే విజయ్‌తో ‘టాక్సీవాలా’ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌లో బీడు భూముల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం సినిమా నేపథ్యాన్ని తెలుపుతోంది. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు యూనిట్‌ తెలిపింది.

Updated Date - May 10 , 2024 | 01:28 AM