ప్రేమలో కొత్త కోణం

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:34 AM

‘అథర్వ’ ఫేమ్‌ కార్తిక్‌ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఐ హేట్‌ యూ’. అంజిరామ్‌ దర్శకత్వంలో నాగరాజు నిర్మించారు...

ప్రేమలో కొత్త కోణం

‘అథర్వ’ ఫేమ్‌ కార్తిక్‌ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఐ హేట్‌ యూ’. అంజిరామ్‌ దర్శకత్వంలో నాగరాజు నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ‘మా ‘ఐ హేట్‌ యూ’ చిత్రం వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కింది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాకార్‌. సినిమాటోగ్రఫీ: ఎస్‌. మురళీ మోహన్‌ రెడ్డి.

Updated Date - Jan 08 , 2024 | 01:34 AM