కొత్త కాన్సెప్ట్‌

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:00 AM

సుగి విజయ్‌, జుప్పీ భద్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఐ హేట్‌ మ్యారేజ్‌ ’ చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. పరమేశ్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో ఎం. దయానంద్‌ నిర్మిస్తున్నారు...

సుగి విజయ్‌, జుప్పీ భద్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఐ హేట్‌ మ్యారేజ్‌ ’ చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. పరమేశ్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో ఎం. దయానంద్‌ నిర్మిస్తున్నారు. నేటి యువతరంతో పాటు కుటుంబ సభ్యులకు నచ్చే భావోద్వేగాలతో ఈ సినిమా ఉంటుందనీ, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుందనీ దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘రొటీన్‌కు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తీస్తున్నాం. డిసెంబర్‌ వరకూ ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది’ అని చెప్పారు.

Updated Date - Oct 01 , 2024 | 04:00 AM