మైథలాజికల్ థ్రిల్లర్
ABN , Publish Date - Oct 04 , 2024 | 01:03 AM
రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్’. కోమల్. ఆర్. భరద్వాజ్ దర్శకత్వంలో...
రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్’. కోమల్. ఆర్. భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో ఓ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ ‘‘మైథలాజికల్ అంశాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి ఎన్నో ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చెప్పారు. నవంబర్ 8న ఈ చిత్రం విడుదలవుతోంది.