మ్యూజికల్‌ జర్నీ

ABN , Publish Date - May 19 , 2024 | 06:27 AM

ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మశాల, అంజన బాలాజీ తదితరులు నటించిన మ్యూజికల్‌, ఫీల్‌గుడ్‌ ఫిల్మ్‌ ‘నీ దారే నా కథ’. వంశీ జొన్నలగడ్డ ఈ చిత్రానికి ...

మ్యూజికల్‌ జర్నీ

ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మశాల, అంజన బాలాజీ తదితరులు నటించిన మ్యూజికల్‌, ఫీల్‌గుడ్‌ ఫిల్మ్‌ ‘నీ దారే నా కథ’. వంశీ జొన్నలగడ్డ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తేజేశ్‌ వీర, శైలజ జొన్నలగడ్డతో కలసి నిర్మించారు. జూన్‌ 14న సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఇది మ్యూజికల్‌ బేస్డ్‌ ఫిల్మ్‌. స్నేహం, కలలు సాధించాలనే సంకల్పం, తండ్రీకొడుకుల బందం.. వంటి అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. ప్రేక్షకులు భావోద్వేగాల రోలర్‌ కోస్టర్‌లా ఫీల్‌ అవుతారు. సంగీతం స్వరాన్ని సెట్‌ చేస్తుంది. అద్భుతమైన సంగీతం, ఎమోషన్స్‌తో ఓ మధురమైన ప్రయాణంలా చిత్రం ఉంటుంది’ అని శివ జొన్నలగడ్డ చెప్పారు. ఈ చిత్రానికి రచన: మురళీకాంత్‌, వంశీ జొన్నలగడ్డ, సంగీతం: ఆల్బర్టో గురియోలి, సినిమాటోగ్రాఫర్‌: ఎలెక్స్‌ కావు.

Updated Date - May 19 , 2024 | 06:27 AM