మ్యూజికల్‌ డ్రామా

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:42 AM

‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్స్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘మ్యాజిక్‌’....

‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్స్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘మ్యాజిక్‌’. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాతలు చిత్రం విడుదల తేదీని ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. డిసెంబరు 21న సినిమా విడుదల కానుంది. ‘తమ కాలేజీ ఫెస్ట్‌ కోసం సొంతంగా ఒక పాటను స్వరపర్చడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మ్యూజికల్‌ డ్రామాలో ఎందరో నూతన నటీ నటులు నటిస్తున్నారు’ అని నిర్మాతలు తెలిపారు.

Updated Date - Oct 18 , 2024 | 12:42 AM