థియేటర్లో చూడాల్సిన చిత్రం
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:33 AM
నూతన నటులతో తీసిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు యదు వంశీ...
నూతన నటులతో తీసిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు యదు వంశీ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఒక ఊరిలో జాతర చుట్టూ జరిగే కథ ఇది. ప్రతీ కుర్రాడు ఈ సినిమాకు రిలేట్ అవుతారు. స్నేహం, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. అన్ని రకాలుగా ఆకట్టుకునే అంశాలున్న ఈ సినిమాను థియేటర్లో చూస్తేనే బాగుంటుంది’’ అని చెప్పారు.