పక్కా థియేటర్స్‌లోనే చూడాల్సిన సినిమా

ABN , Publish Date - May 03 , 2024 | 05:35 AM

నటుడు సత్య దేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని...

పక్కా థియేటర్స్‌లోనే చూడాల్సిన సినిమా

నటుడు సత్య దేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు, మే 10 ఈ చిత్రం విడుదల అవుతోంది. బుధవారం ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.ఎ్‌స.రాజమౌళి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌ టీజర్‌, ట్రైలర్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఇది పక్కా థియేటర్స్‌లోనే చూడాల్సిన సినిమా అన్న అనుభూతిని కలిగించారు. ఈ సినిమాతో సత్యదేవ్‌ స్టార్‌ అవుతారు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. చిత్ర సమర్పకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌ చెప్పిన కథ వినగానే ఈ సినిమాలో నేనూ ఓ భాగం అవుదామని ఇలా సమర్పకుడిగా వ్యవహరించాను. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్‌ ఒకరు. కాల భైరవ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అని అన్నారు. హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘కొరటాల శివ సినిమాను ఓకే చేయగానే సినిమా సగం సక్సెస్‌ అనుకున్నాం. డైరెక్టర్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఇది వంద కోట్ల కంటెంట్‌ ఉన్న సినిమా అనిపించింది. కృష్ణా నది ఎన్ని మలుపులు తిరిగి గమ్య స్థానం చేరుకుంటుందో..ఈ సినిమాలోనూ అన్నే మలుపులు ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘మూవీకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామో సినిమా చూశాక తెలుస్తుంది’’ అని డైరెక్టర్‌ గోపాలకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్‌ అనిల్‌ రావిపూడి, గోపిచంద్‌ మలినేని, చిత్ర బృందం పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 05:35 AM