ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే సినిమా

ABN , Publish Date - Oct 28 , 2024 | 12:20 AM

‘క’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు ‘గం గం గణేశా’, ‘ఆయ్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నయన్‌ సారిక, మలయాళ నటి తన్వీ రామ్‌. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని...

‘క’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు ‘గం గం గణేశా’, ‘ఆయ్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నయన్‌ సారిక, మలయాళ నటి తన్వీ రామ్‌. కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ తెరకెక్కించారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్లు నయన సారిక, తన్వీరామ్‌ మీడియాతో ముచ్చటించారు.

నయన్‌ సారిక మాట్లాడుతూ ‘‘నేను ఇది వరకు చేసిన చిత్రాల్లోకంటే ఇందులో భిన్నమైన పాత్రను పోషించా. సినిమాలో సత్యభామ అనే సంప్రదాయబద్ధమైన యువతిగా నటించా. క్టైమాక్స్‌ను చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. ఇది యూనివర్సల్‌ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం. అందుకే పాన్‌ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే సినిమా ఇది’’ అని చెప్పారు. తన్వీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో రాధ అనే ఓ స్కూల్‌ టీచర్‌ పాత్రలో నటించాను. సినిమాలో నా పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. సినిమాలో కిరణ్‌ అబ్బవరం, తన్వీరామ్‌, నేను పోషించిన పాత్రలకూ ఉన్న సంబంధం ఏంటనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బోలెడు ట్విస్టులు ఉంటాయి. ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామనేది థియేటర్లో సినిమా చూసినప్పుడు తెలుస్తుంది’’ అని అన్నారు.


సినిమాల్లో నటించడమే మానేస్తా

ఇటీవలే పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘క’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘ఇది టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యమున్న చిత్రం కాదు.. వాసుదేవ్‌ అనే వ్యక్తి ప్రయాణం. స్ర్కీన్‌ ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ సరికొత్త భావోద్వేగాన్ని పంచే చిత్రమిది. మల్టీప్లెక్స్‌ల కోసం రాసిన కథ కాదిది. బీ,సీ సెంటర్ల కోసమే సిద్ధం చేసిన కథ ఇది. ఇలాంటి కాన్సెప్ట్‌తో మునుపెన్నడూ సినిమా రాలేదు. ఒక వేళ వచ్చిందని నిరూపిస్తే.. సినిమాలు తీయడం మానేస్తాను’’ అని తెలిపారు.

Updated Date - Oct 28 , 2024 | 12:20 AM