ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే సినిమా

ABN, Publish Date - Jul 18 , 2024 | 12:52 AM

ఇటీవలే ‘ఓమ్‌ భీమ్‌ బుష్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు ప్రియదర్శి. ఆయన, నభానటేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌రామ్‌ దర్శకత్వంలో...

ఇటీవలే ‘ఓమ్‌ భీమ్‌ బుష్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు ప్రియదర్శి. ఆయన, నభానటేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌రామ్‌ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించారు. సినిమా రేపు విడుదలవుతోన్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

‘‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. స్ర్కిప్ట్‌పై పూర్తి నమ్మకం ఉంది. సినిమాకు ఈ టైటిల్‌ను చాలా ప్రేమతో పెట్టాం. కపుల్స్‌ మధ్య జరిగే సంఘటనలని వినోదాత్మకంగా చూపించే ఈ సినిమా.. రిలేషన్‌షి్‌పలో ఉన్న వారితో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుంది. ఇందులో నా ప్రపంచం, నభా ప్రపంచం చాలా వేరుగా ఉంటాయి. భిన్న ధృవాలైన మా ఇద్దరి మధ్య సీరియ్‌సగా జరిగే సంఘటనలతో సాగే సన్నిశాలను ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తారు. స్ర్కీన్‌ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ‘డార్లింగ్‌’ సినిమాను అందరూ చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు’’ అని ప్రియదర్శి అన్నారు.

Updated Date - Jul 18 , 2024 | 12:52 AM