నన్ను కోత్త కోణంలో చూపించే సినిమా

ABN , Publish Date - May 27 , 2024 | 01:09 AM

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. జూన్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...

నన్ను కోత్త కోణంలో చూపించే సినిమా

నవదీప్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. జూన్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్‌ మాట్లాడుతూ ‘20 ఏళ్ల నట జీవితం తర్వాత నన్ను కోత్త కోణంలో చూపించే సినిమా ఇది. ఈ చిత్రం ప్రొడక్షన్‌ ఎలా జరిగిందనే దానిమీద ఓ సినిమా తీయవచ్చు. నా లవ్‌స్టోరీలో ఉన్న పాయింట్‌ను టచ్‌ చేశాం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రమిది. చిరపుంజి, మేఘాలయలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం’ అన్నారు. రాజీపడితే తప్ప బంధాలు నిలబడవా అనే సమస్యకు నాకు దొరికిన పరిష్కారాన్ని ఈ చిత్రంలో చూపెడుతున్నాం’ అని దర్శకుడు తెలిపారు.

Updated Date - May 27 , 2024 | 01:09 AM