పాత్రను ఇష్టపడి చేసిన సినిమా

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:44 AM

బిగ్‌బాస్‌ ఫేమ్‌ రవికృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బర్త్‌డే బాయ్‌’. విస్కీ దర్శకత్వంలో ఐ.భరత్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా...

బిగ్‌బాస్‌ ఫేమ్‌ రవికృష్ణ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘బర్త్‌డే బాయ్‌’. విస్కీ దర్శకత్వంలో ఐ.భరత్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రవికృష్ణ మీడియాతో ముచ్చటించారు. ‘‘నాకు రియల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలంటే చాలా ఇష్టం. ఇందులో నా పాత్ర బాగా నచ్చి కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నాను. ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతీ పాత్ర కూడా ఎంటర్టైన్‌ చేస్తుంది. ఎం.ఎస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితుల జీవితం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.’’ అని చెప్పారు.

Updated Date - Jul 16 , 2024 | 04:44 AM