తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:55 AM

‘‘నేను ‘హరోం హర’ లాంటి సినిమా చేయాలని సూపర్‌స్టార్‌ కృష్ణ గారు కోరుకున్నారు. ఆయన కోరుకున్న విధంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటిి నేపథ్యంలో తెలుగులో సినిమా రాలేదు...

తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు

‘‘నేను ‘హరోం హర’ లాంటి సినిమా చేయాలని సూపర్‌స్టార్‌ కృష్ణ గారు కోరుకున్నారు. ఆయన కోరుకున్న విధంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటిి నేపథ్యంలో తెలుగులో సినిమా రాలేదు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇదే ఫీలవుతారు’’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆయన హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘ప్రతి సన్నివేశంపైనా ఎంతో వర్క్‌ చేసి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాం. మంచి హిట్‌ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది’ అన్నారు.


జ్ఞానసాగర్‌ ద్వారక మాట్లాడుతూ ‘ఈ సినిమాను మురుగన్‌ స్వామికి అంకింతం ఇస్తున్నా. సింగిల్‌ సిట్టింగ్‌లో సుధీర్‌ కథ ఓకే చేశారు. ఆయన కష్టం వల్లే సినిమా అద్భుతంగా వచ్చింది’ అని చెప్పారు. ‘‘హరోం హర’ ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. ఇదొక కమర్షియల్‌ మూవీ.సాగర్‌ అద్బుతంగా తీశారు’ అని నిర్మాతలు సుబ్రహ్మణ్యం, సుమంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్వక్‌సేన్‌, అడివిశేష్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 04:55 AM