ప్రతి భారతీయుడు గర్వించే సినిమా

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:30 AM

సీనియర్‌ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రూపొందించిన పాన్‌ ఇండియా మూవీ ‘రికార్డ్‌ బ్రేక్‌’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి జయసుధ తనయుడు నిహిర్‌ కపూర్‌ ఇందులో...

ప్రతి భారతీయుడు గర్వించే సినిమా

సీనియర్‌ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రూపొందించిన పాన్‌ ఇండియా మూవీ ‘రికార్డ్‌ బ్రేక్‌’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి జయసుధ తనయుడు నిహిర్‌ కపూర్‌ ఇందులో ఒక హీరోగా నటించారు. విడుదల సందర్భంగా ఆయన సోమవారం మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • ఇంతకుముందు నేను ‘గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు’ చిత్రంలో నటించాను. ఆ సినిమా షూటింగ్‌లో శ్రీనివాసరావుగారు ‘బాగా చేస్తున్నావు.. నా దగ్గర ఓ కథ ఉంది. నువ్వు యాప్ట్‌ అవుతావు’ అని కథ చెప్పారు. చాలా ఎక్సయింటింగ్‌గా అనిపించి నేను ఈ సినిమా ఒప్పుకొన్నాను. ఇద్దరు అనాధలు అడవిలో పెరుగుతుంటారు. కవలలైన వాళ్లిద్దరూ పట్నం వచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఈ చిత్రకథ. చాలా ఆసక్తికరంగా చూపించారు.

  • ‘దంగల్‌’ చిత్రానికీ ఈ కథకు పోలిక లేదు. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాథల జర్నీని ఆకట్టుకొనే విధంగా చూపించారు. సెంటిమెంట్‌, ఎమోషనల్‌ అంశాలు కలిగిన కమర్షియల్‌ చిత్రమిది. సాంగ్స్‌, ఫైట్స్‌ బాగుంటాయి.

  • రాజస్థాన్‌, హర్యానా వంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతాయి. డీటైలింగ్‌ మీద ఉత్తరాది వారు ఎక్కువ సినిమాలు తీస్తుంటారు. ‘రికార్డ్‌ బ్రేక్‌’ తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉంటుంది. ఇలాంటి చిత్రం తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో విడుదల చేస్తున్నాం.

  • శ్రీనివాసరావుగారికి సినిమా అంటే ప్యాషన్‌. దేశభక్తి మిళితమైన మంచి కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా జనాలకు చెప్పాలనుకున్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.

  • ఇక నుంచి నటనని కంటిన్యూ చేస్తా. అలాగే దర్శకత్వం కూడా చేయాలనుకుంటున్నాను. స్ర్కిప్టులు తయారు చేస్తున్నా.

Updated Date - Mar 05 , 2024 | 02:30 AM