A masterpiece : కెరీర్‌లో గుర్తుండిపోతుంది

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:19 AM

‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి విభిన్న చిత్రాల తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్‌ అందిస్తున్న సినిమా ‘ఎ మాస్టర్‌ పీస్‌’. మనీష్‌ గిలాడ, అరవింద్‌ కృష్ణ, జ్యోతి పూర్వజ్‌, అషు రెడ్డి ప్రధాన

A masterpiece : కెరీర్‌లో గుర్తుండిపోతుంది

‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి విభిన్న చిత్రాల తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్‌ అందిస్తున్న సినిమా ‘ఎ మాస్టర్‌ పీస్‌’. మనీష్‌ గిలాడ, అరవింద్‌ కృష్ణ, జ్యోతి పూర్వజ్‌, అషు రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ కండ్రేగుల, మనీష్‌ గిలాడ నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసిన అనంతరం మనీష్‌ గిలాడ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో విలన్‌గా నటించాను. మా అందరి కెరీర్‌లో గుర్తిండి పోయే గొప్ప చిత్రం అవుతుంది’ అన్నారు. దర్శకుడు సుకు పూర్వజ్‌ మాట్లాడుతూ ‘భాగవతంలోని జయ, విజయుల పాత్రల నేపథ్యంలో హీరో, విలన్‌ పాత్రలను డిజైన్‌ చేశాను. మైథాలజినీ, సైన్స్‌ ఫిక్షన్‌ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నాం. చిన్న ప్రాజెక్ట్‌గా మొదలై నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకపోవడంతో పెద్ద సినిమా అయింది. సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుత అనుభూతినిస్తాయి. క్లైమాక్స్‌ మినహా చిత్రం పూర్తయింది. పది రోజుల్లో ఆ వర్క్‌ పూర్తి చేస్తాం’ అని చెప్పారు. తెలుగులో ఒక ప్రాపర్‌ సూపర్‌ హీరో ప్రాజెక్ట్‌ చేయాలని ఈ సినిమా తీస్తున్నట్లు నిర్మాత శ్రీకాంత్‌ చెప్పారు. సీరియల్స్‌లో నటించిన తను ‘ఎ మాస్టర్‌ పీస్‌’తో సినిమాల్లో అడుగుపెడుతున్నట్లు నటి, దర్శకుడు సుకు సతీమణి జ్యోతి చెప్పారు. ఇది మనం గర్వంగా చెప్పుకొనే సూపర్‌ హీరో మూవీ అవుతుందని అరవింద్‌ కృష్ణ చెప్పారు.

Updated Date - Jun 08 , 2024 | 05:19 AM