పద్నాలుగు రోజుల ప్రేమకథ

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:38 AM

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రం ‘14 డేస్‌ లవ్‌’. నాగరాజు బోడెం దర్శకత్వంలో హరిబాబు దాసరి నిర్మించారు. మనోజ్‌ పుట్టూర్‌, చాందిని భాగవని హీరో హీరోయిన్లుగా నటించారు...

పద్నాలుగు రోజుల ప్రేమకథ

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రం ‘14 డేస్‌ లవ్‌’. నాగరాజు బోడెం దర్శకత్వంలో హరిబాబు దాసరి నిర్మించారు. మనోజ్‌ పుట్టూర్‌, చాందిని భాగవని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తమ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంద’ని చెప్పారు. కుటుంబ విలువలు, సంప్రదాయాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశామని దర్శకుడు తెలిపారు. సంగీతం: కిరణ్‌ వెన్న. సినిమాటోగ్రఫీ: కన్నన్‌ మునస్వామి

Updated Date - Feb 22 , 2024 | 05:38 AM