పడమటి కొండల్లో ప్రేమకథ

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:24 AM

అనురూప్‌ కటారి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పడమటి కొండల్లో’. నరేశ్‌ పెంట దర్శక త్వంలో జయకృష్ణ దురుగడ్డ నిర్మించారు. యశస్వి శ్రీనివాస్‌, శ్రావ్యారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు...

పడమటి కొండల్లో ప్రేమకథ

అనురూప్‌ కటారి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పడమటి కొండల్లో’. నరేశ్‌ పెంట దర్శక త్వంలో జయకృష్ణ దురుగడ్డ నిర్మించారు. యశస్వి శ్రీనివాస్‌, శ్రావ్యారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం హీరో సాయి దుర్గ తేజ్‌ సోషల్‌ మీడియాలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్‌లో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకొన్న హీరో గంభీరంగా కనిపించాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘పడమటి కొండల్లో’ సినిమాతో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తాం. ఇందులో యాక్షన్‌తో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. అందమైన లొకేషన ్లలో చిత్రీకరణ చేస్తాం. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నాను’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కన్నన్‌ మునిసామి.

Updated Date - Apr 24 , 2024 | 05:24 AM