పద్మవ్యూహంలో ప్రేమకథ

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:37 AM

ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా శశికాటిక్కో, ఆషురెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే టైటిల్‌ను....

పద్మవ్యూహంలో ప్రేమకథ

ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా శశికాటిక్కో, ఆషురెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మవ్యూహంలో చక్రధారి’ అనే టైటిల్‌ను చిత్రబృందం నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ ఉంటుంది. అందులో కొందరు సఫలం అయితే మరికొందరు విఫలమవుతారు. అలా తన తొలిప్రేమ జ్ఞాపకాల నుంచి బయటపడి జీవితంలో ముందుకు సాగడానికి ఓ వ్యక్తి అనుభవించిన సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంద’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పద్మవ్యూహంలో చక్రధారి’ మంచి కంటెంట్‌తో తీసిన సినిమా. రాయలసీమ అనగానే పగ, ప్రతీకారాలు మాత్రమే అనేలా ప్రచారంలో ఉంది. కానీ మా చిత్రంలో ఈ ప్రాంతంలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమని చూపించబోతున్నాం’ అన్నారు. ఆషురెడ్డి మాట్లాడుతూ ‘ఇందులో నా పాత్ర పేరు పద్మ. విభిన్నంగా ఉంటుంద’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య. సినిమాటోగ్రఫీ: జీ అమర్‌

Updated Date - Feb 16 , 2024 | 05:37 AM