గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథ

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:52 AM

పృథ్వీ, రూపాలి, అంబిక హీరోహీరోయిన్లుగా నటించే చిత్రం షూటింగ్‌ బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి హజరైన...

గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథ

పృథ్వీ, రూపాలి, అంబిక హీరోహీరోయిన్లుగా నటించే చిత్రం షూటింగ్‌ బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమానికి హజరైన సీనియర్‌ నటి ఆమని మాట్లాడుతూ ‘ఇందులో నేను ముఖ్య పాత్ర పోషిస్తున్నా. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకొనే ప్రేమకథ ఇది’ అని చెప్పారు. నిర్మాతలు దుర్గం రాజేశ్‌, రావుల రమేశ్‌, టి.ఎస్‌.రాజు మాట్లాడుతూ ‘తెలంగాణ నుంచి హీరో పృథ్వీని, బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లను, మలయాళం నుంచి అనిరుధ్‌ని విలన్‌గా ఎంపిక చేసి ఈ సినిమా తీస్తున్నాం’ అని చెప్పారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నామని దర్శకుడు పాలిక్‌ శ్రీను తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 05:52 AM