ఓ ప్రేమమూర్తి కథ

ABN , Publish Date - Nov 07 , 2024 | 04:14 AM

ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్వేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ‘తల్లి మనసు’. రుచిత మహాలక్ష్మి, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించారు...

ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్వేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ‘తల్లి మనసు’. రుచిత మహాలక్ష్మి, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. వి. శ్రీనివాస్‌ దర్శకుడు. సీనియర్‌ డైరెక్టర్‌ ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిశోర్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ ‘మాకు చాలా సంతృప్తిని ఇచ్చిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరింపచేస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 04:14 AM