గగనంలో ప్రేమపక్షుల ప్రణయ గీతం

ABN , Publish Date - Feb 07 , 2024 | 06:08 AM

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. భారత వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడానికి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను...

గగనంలో ప్రేమపక్షుల ప్రణయ గీతం

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. భారత వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడానికి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు. మానుషి చిల్లర్‌ కథానాయిక. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడు. మార్చి 1న విడుదలవుతోంది. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్రబృందం రెండో గీతాన్ని విడుదల చేసింది. ‘గగనాల’ అంటూ సాగే ఈ గీతంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రణయాన్ని ఆవిష్కరించారు. మిక్కీ జే మేయర్‌ స్వరపరిచిన ఈ రొమాంటిక్‌ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మరో స్థాయిలో ఉంటుంది. 130 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించే సైనికుల త్యాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం’ అన్నారు. మానుషి చిల్లర్‌ మాట్లాడుతూ ‘‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అందరూ గర్వపడే అద్భుతమైన సినిమా’ అని చెప్పారు.

Updated Date - Feb 07 , 2024 | 06:08 AM