వినోదం పంచే కొంచెం హట్కే

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:00 AM

గురుచరణ్‌, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అవినాశ్‌ కుమార్‌ దర్శకత్వంలో అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది...

వినోదం పంచే కొంచెం హట్కే

గురుచరణ్‌, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అవినాశ్‌ కుమార్‌ దర్శకత్వంలో అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో హీరో హీరోయిన్లు ఉండరు. పాత్రలే ఉంటాయి. సినిమా వినోదాత్మకంగా ఉంటుంది’ అన్నారు. కొంతమంది కలసి సినిమా తీయడానికి చేసే ప్రయత్నాలు వినోదం పంచుతాయని గురుచరణ్‌ తెలిపారు.

Updated Date - Apr 14 , 2024 | 04:00 AM