రెండు తరాల ప్రయాణం

ABN , Publish Date - Apr 22 , 2024 | 04:38 AM

అజయ్‌ ఘోష్‌, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. చిత్రబృందం టీజర్‌ విడుదల...

రెండు తరాల ప్రయాణం

అజయ్‌ ఘోష్‌, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు అజయ్‌ భూపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘రెండు తరాల వ్యక్తులు కలసి ప్రయాణం చేస్తే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. అదే ఈ సినిమా చెప్పే పాఠం’ అన్నారు. అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడు నేను మెయిన్‌ లీడ్‌ ఏంటి అనుకున్నాను. సెట్స్‌ మీదకు వ చ్చాక ఈ సినిమా గొప్పదనం తెలిసింది. ఇందులో కథే హీరో’ అన్నారు. మధ్యతరగతి కుటుంబాల కథ ఇది. ప్రేక్షకులను నిరాశ పరచదు అని చాందిని చౌదరి తెలిపారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో బడ్జెట్‌ పెరిగినా వెనక్కు తగ్గలేదు అని నిర్మాతలు చెప్పారు.

Updated Date - Apr 22 , 2024 | 04:38 AM