పదిహేనేళ్ల ప్రయాణం

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:35 AM

అక్కినేని నాగచైతన్య తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి పదిహేనేళ్లు అయింది. ఆయన నటించిన తొలి చిత్రం ‘జోష్‌’ 2009 సెప్టెంబర్‌ 5న విడుదలైంది. ఈ పదిహేనేళ్ల ప్రయాణంలో విలక్షణమైన పాత్రలు ఎన్నో పోషించి...

అక్కినేని నాగచైతన్య తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి పదిహేనేళ్లు అయింది. ఆయన నటించిన తొలి చిత్రం ‘జోష్‌’ 2009 సెప్టెంబర్‌ 5న విడుదలైంది. ఈ పదిహేనేళ్ల ప్రయాణంలో విలక్షణమైన పాత్రలు ఎన్నో పోషించి, మంచి నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ చిత్ర యూనిట్‌ ప్రత్యేకమైన పోస్టర్‌ విడుదల చేసింది. సముద్రం దగ్గర ఫిషింగ్‌ బోట్‌ మీద నిల్చుని చిరునవ్వు చిందిస్తున్న చైతు లుక్‌ ఆకట్టుకుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. బన్నీ వాస్‌ నిర్మాత.

Updated Date - Sep 06 , 2024 | 12:35 AM