దసరాకు వస్తున్న వేటగాడు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:01 AM

రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేట్టయాన్‌’. లైకా ప్రొడక్షన్స్‌ బేనర్‌పై సుభాస్కరన్‌ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌...

దసరాకు వస్తున్న వేటగాడు

రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేట్టయాన్‌’. లైకా ప్రొడక్షన్స్‌ బేనర్‌పై సుభాస్కరన్‌ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా కీలకపాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్‌ ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ అప్డేట్‌ను ఇచ్చారు. దసరా సందర్భంగా అక్టోబర్‌లో ‘వేట్టయాన్‌’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రివాల్వర్‌ గురిపెట్టిన రజనీకాంత్‌ స్టిల్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌

Updated Date - Apr 08 , 2024 | 01:01 AM