సూర్య కెరీర్‌లోనే హై బడ్జెట్‌ ఫిల్మ్‌

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:41 AM

విభిన్న పాత్రలను పోషించడంలో ఎప్పుడూ ముందుండే తమిళ హీరో సూర్య ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ‘కంగువ’లో నటిస్తున్నారు. మొత్తం పది భాషల్లో విడుదల కానున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు శివ దర్శకత్వం...

సూర్య కెరీర్‌లోనే హై బడ్జెట్‌ ఫిల్మ్‌

విభిన్న పాత్రలను పోషించడంలో ఎప్పుడూ ముందుండే తమిళ హీరో సూర్య ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ‘కంగువ’లో నటిస్తున్నారు. మొత్తం పది భాషల్లో విడుదల కానున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దిశా పటాని కథానాయిక. ఈ సినిమా డబ్బింగ్‌ వర్క్‌ ప్రారంభించారు సూర్య. ఆయన కెరీర్‌లోని హై బడ్జెట్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. త్రీడీలోనూ ‘కంగువ’ విడుదల కానుంది.

Updated Date - Feb 22 , 2024 | 05:41 AM