ఊరినే ఉప్పొంగించే వీరుడు

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:47 AM

‘సాదా సీదా మగాళ్లు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’... ప్రస్తుతం ఎన్టీఆర్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న డైలాగ్‌ ఇది. ఆయన కథానాయకుడిగా శివ కొరటాల...

‘సాదా సీదా మగాళ్లు కావాలా, ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా’... ప్రస్తుతం ఎన్టీఆర్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న డైలాగ్‌ ఇది. ఆయన కథానాయకుడిగా శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ చిత్రంలోని ఈ డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర ల్‌ అవుతోంది. ఇటీవలే చిత్రబృందం డబ్బింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో నుంచి ఓ డైలాగ్‌ లీక్‌ అయి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ ఊరికోసం పోరాడే వీరుడు అని తెలుస్తోంది. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా వస్తోంది. తొలి భాగం సెప్టెంబర్‌ 27న విడుదలవుతోంది. ఇందులో జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ నిర్మిస్తున్నాయి.

Updated Date - Jul 11 , 2024 | 04:47 AM