హృదయాన్ని కదిలించే ప్రేమకథ
ABN , Publish Date - Feb 14 , 2024 | 05:59 AM
అభిషేక్ పచ్చిపాల, నజియాఖాన్ జంటగా నటించిన చిత్రం ‘జస్ట్ ఎ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో అర్షద్ తన్వీర్, డాక్టర్ ప్రకాశ్ దర్మపురి నిర్మించారు...

అభిషేక్ పచ్చిపాల, నజియాఖాన్ జంటగా నటించిన చిత్రం ‘జస్ట్ ఎ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో అర్షద్ తన్వీర్, డాక్టర్ ప్రకాశ్ దర్మపురి నిర్మించారు. ఇటీవలే చిత్రబృందం ఆడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘గాఢతతో నిండిన ప్రేమకథాంశంతో రూపొందించిన చిత్రం ‘జస్ట్ ఎ మినిట్’. ఈ సినిమాకు సంగీతం ప్రత్యేకాకర్షణ’ అన్నారు. ‘ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించి, ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రం ఇది’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ కే బాజీ. సినిమాటోగ్రఫీ: అమీర్