దమ్‌ బిర్యానీలాంటి హ్యాపీ ఎండింగ్‌

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:47 AM

‘సినిమాలో అందమైన హ్యూమన్‌ ఎమోషన్‌ ఉంది. సినిమా కథకు అసలైన పాయింట్‌ అదే. శాపం అనేది చిన్న డ్రైవింగ్‌ ఫోర్స్‌ మాత్రమే. కథలో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేది ఎమోషన్‌కే. అన్ని దినుసులు ఉన్న దమ్‌ బిర్యానీ లాంటి సినిమా ‘హ్యాపీ ఎండింగ్‌’ అని చెప్పారు....

దమ్‌ బిర్యానీలాంటి హ్యాపీ ఎండింగ్‌

‘సినిమాలో అందమైన హ్యూమన్‌ ఎమోషన్‌ ఉంది. సినిమా కథకు అసలైన పాయింట్‌ అదే. శాపం అనేది చిన్న డ్రైవింగ్‌ ఫోర్స్‌ మాత్రమే. కథలో ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేది ఎమోషన్‌కే. అన్ని దినుసులు ఉన్న దమ్‌ బిర్యానీ లాంటి సినిమా ‘హ్యాపీ ఎండింగ్‌’ అని చెప్పారు యశ్‌ పూరి. ఆయన హీరోగా నటించిన ‘హ్యాపీ ఎండింగ్‌’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా యశ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్‌ తీసుకుని మా దర్శకుడు కౌశిక్‌ ఈ చిత్రకథ తయారు చేశారు. సినిమాలో అంతా ఫన్‌. వినోదభరితంగా సాగిపోతుంది. ముఖ్యంగా చివరి పదిహేను నిముషాలు మిస్‌ కావద్దు.’ అన్నారు, మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్‌ తీసుకుని ఇప్పటి జనరేషన్‌ ఆడియన్స్‌కు నచ్చేలా చిత్రాన్ని తీసినట్లు యశ్‌ చెప్పారు. ‘ న్యూ హీరో యంగ్‌ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేయాలంటే కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండాలి. ఫ్రెండ్స్‌తో మీరు ఎంజాయ్‌ చేసేలా సినిమా ఉంటుంది. నేను నాలుగు సినిమాలు చేశాను. అన్నింటిలోనూ స్టోరీ ఫస్ట్‌ హీరో. నేను సెకండ్‌ హీరోని. ఈ చిత్రంలోనూ అంతే’ అని తెలిపారు యశ్‌.

Updated Date - Feb 01 , 2024 | 02:47 AM