ఘనంగా బాఫ్టా అవార్డుల వేడుక

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:23 AM

ప్రతిష్ఠాత్మక 77వ బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అవార్డ్స్‌ (బాఫ్టా) ప్రధానోత్సవం లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది. ‘ఓపెన్‌ హైమర్‌’ చిత్రం మెజారిటీ పురస్కారాలను కొల్లగొట్టింది...

ఘనంగా బాఫ్టా అవార్డుల వేడుక

ప్రతిష్ఠాత్మక 77వ బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అవార్డ్స్‌ (బాఫ్టా) ప్రధానోత్సవం లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది. ‘ఓపెన్‌ హైమర్‌’ చిత్రం మెజారిటీ పురస్కారాలను కొల్లగొట్టింది. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (సిలియన్‌ మర్ఫీ), ఉత్తమచిత్రం సహా మరో ఏడు విభాగాల్లో పురస్కారాలను గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో ‘పూర్‌ థింగ్స్‌’ చిత్రం ఐదు బాఫ్టా పురస్కారాలను గెలుపొందింది. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్‌ నిలిచారు. బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొనే ఈ కార్యక్రమానికి ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె సహ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దీపిక చీరకట్టులో కనిపించి వేదికపై సందడి చేశారు. ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ చిత్రం ఉత్తమ ఆంగ్లేతర చిత్రాల కేటగిరీలో విజేతగా నిలవగా, దర్శకుడు జొనాథన్‌ గ్లేజర్‌కు దీపికా పదుకొనే పురస్కారాన్ని అందజేశారు.

Updated Date - Feb 20 , 2024 | 05:23 AM