మంచి సినిమాకు హద్దులు ఉండవు
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:57 AM
జోజు జార్జ్ మలయాళంలో నటించి దర్శకత్వం వహించిన ‘పని’ సినిమా ఈనెల 13న తెలుగులో విడుదలవుతోంది. అభినయ కీలక పాత్రలో నటించారు. ఆమ్ వర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని...
జోజు జార్జ్ మలయాళంలో నటించి దర్శకత్వం వహించిన ‘పని’ సినిమా ఈనెల 13న తెలుగులో విడుదలవుతోంది. అభినయ కీలక పాత్రలో నటించారు. ఆమ్ వర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం లాంచ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ మాట్లాడుతూ ‘ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది’ అని అన్నారు. హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ ‘నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అని అన్నారు.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అభియన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, నటుడు జెమినీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.