నవ్వించే మంచి దెయ్యం

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:16 AM

వెన్నెల కిశోర్‌, నందితా శ్వేత, నవమి గాయక్‌ ముఖ్య పాత్రలు పోషించిన హారర్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓఎంజీ’(ఓ మంచి ఘోస్ట్‌) ఈ నెల 21న విడుదల కానుంది. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో...

నవ్వించే మంచి దెయ్యం

వెన్నెల కిశోర్‌, నందితా శ్వేత, నవమి గాయక్‌ ముఖ్య పాత్రలు పోషించిన హారర్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓఎంజీ’(ఓ మంచి ఘోస్ట్‌) ఈ నెల 21న విడుదల కానుంది. శంకర్‌ మార్తాండ్‌ దర్శకత్వంలో డాక్టర్‌ బినికా ఇనాబతుని నిర్మించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. మా మీదున్న నమ్మకంతో అబినికా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. అనూప్‌ ఇచ్చిన రీరికార్డింగ్‌ సినిమాను మరో స్థాయికి తీసు కెళ్లింది’ అని తెలిపారు. ‘ఇది మాకు తొలి సినిమా. శంకర్‌ కథ ఎంత బాగా చెప్పారో అంతకుమించి అనేలా సినిమాను తీశారు. అందరూ చూడతగ్గ చిత్రమిది’ అని చెప్పారు డాక్టర్‌ అబినికా. నందితా శ్వేత మాట్లాడుతూ ‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. స్టోరీ నెరేట్‌ చేస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. అందరినీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది’ అన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 02:16 AM