అమరావతిలో గేమ్ చేంజర్
ABN , Publish Date - Nov 27 , 2024 | 06:24 AM
రామచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్‌చేంజర్’. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు...
రామచరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్‌చేంజర్’. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మంగళవారం ద్యానబుద్ద సమీపంలోని హరిత వసతిగృహంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తున్నారు. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అమరావతి, (ఆంధ్రజ్యోతి)