ఫ్లెక్సిబుల్ విధానం అవసరం
ABN , Publish Date - Oct 16 , 2024 | 06:21 AM
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని, ఇందుకోసం ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని ఏపీ ఫిల్మ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు...
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయని, ఇందుకోసం ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలని ఏపీ ఫిల్మ్ చాంబర్ మాజీ అధ్యక్షుడు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఫ్లెక్సిబుల్ విధానం ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉందనీ, ఈ అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. విశ్వనాథ్ సూచనలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి ఈ వివరాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
అమరావతి, (ఆంధ్రజ్యోతి)