మత్స్యకారుల జీవిత కథ

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:36 AM

రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సముద్రుడు’. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో బదావత్‌ కిషన్‌ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు...

మత్స్యకారుల జీవిత కథ

రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సముద్రుడు’. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో బదావత్‌ కిషన్‌ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సముద్రమే జీవనాధారమైన మత్య్సకారుల జీవితాలను ప్రతిబింబించే కథ ఇది. వారి జీవన పోరాటం, మనోవేదన ఇందులో చూపిస్తున్నాం. త్వరలో సినిమా విడుదల చేస్తాం’ అని తెలిపారు. చిత్ర నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా వెనుకంజ వేయకుండా అనుకున్న విధంగా చిత్రాన్ని పూర్తి చేయగలిగామని హీరో రమాకాంత్‌ చెప్పారు.

Updated Date - Mar 30 , 2024 | 04:36 AM