జాలరి జీవిత పోరాటం

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:49 AM

మత్స్యకారుల జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రేవు’. వంశీ రామ్‌, స్వాతీ భీమ్‌ రెడ్డి జంటగా నటించారు. ఎల్బీ శ్రీరామ్‌ అతిథి పాత్ర పోషించారు. సముద్రంలోని మత్స్యసంపదపై ఆధిపత్యం కోసం...

జాలరి జీవిత పోరాటం

మత్స్యకారుల జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రేవు’. వంశీ రామ్‌, స్వాతీ భీమ్‌ రెడ్డి జంటగా నటించారు. ఎల్బీ శ్రీరామ్‌ అతిథి పాత్ర పోషించారు. సముద్రంలోని మత్స్యసంపదపై ఆధిపత్యం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో దర్శకుడు హరినాథ్‌ పులిచర్ల తెరకెక్కించారు. ఏ. ఆర్‌ ఫిలిం టీమ్‌, విజయా టాకీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్‌, పోస్టర్‌ను సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘హరినాథ్‌ రియలిస్టిక్‌ అప్రోచ్‌తో ఈ చిత్రం తీశాడు. మంచి విజయం అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రేవు’ చిత్రం ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది. ఫిబ్రవరిలో విడుదల చేస్తాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు.

Updated Date - Jan 05 , 2024 | 06:50 AM