ఫ్యామిలీతో చూడతగ్గ చిత్రం

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:40 AM

‘ఈ సినిమాతో అందరికీ ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఆసక్తితో అందరూ పని చేశారు. నేను సలహాలు ఇవ్వడం వరకే కానీ నిజానికి...

‘ఈ సినిమాతో అందరికీ ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఆసక్తితో అందరూ పని చేశారు. నేను సలహాలు ఇవ్వడం వరకే కానీ నిజానికి కష్టపడింది మాత్రం టీమే. వీళ్ల కష్టానికి తగిన ఫలితం మంచి హిట్‌ ద్వారా వస్తుందని బలంగా కోరుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు మారుతి. రాజ్‌ తరుణ్‌ హీ రోగా నటించిన ‘భలే ఉన్నాడే’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆయన పాల్గొన్నారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో ఎన్వీ కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘ మా సినిమాకు అతి ముఖ్యమైన వ్యక్తి దర్శకుడు శివసాయి. మారుతిగారు చెప్పిన పాయింట్‌ను అద్భుతంగా తెరకు ఎక్కించారు. పని రాక్షసుడు. నన్ను చాలా కొత్తగా చూపించాడు. గ్రేట్‌ డైరెక్టర్‌ సింగీతం గారితో కలసి పని చేయడం గొప్ప అనుభూతి’ అన్నారు. తన పదిహేనేళ్ల కలను నిజం చేసిన మారుతికి దర్శకుడు శివసాయి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యామిలీతో చూడతగ్గ చిత్రమిదని నిర్మాత కిరణ్‌కుమార్‌ చెప్పారు.

Updated Date - Sep 13 , 2024 | 04:40 AM