ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం

ABN , Publish Date - Aug 28 , 2024 | 02:35 AM

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘భలే ఉన్నాడే’ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో ఎన్వీ కిరణ్‌కుమార్‌ నిర్మించారు. దర్శకుడు మారుతి సమర్పకుడు...

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన ‘భలే ఉన్నాడే’ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో ఎన్వీ కిరణ్‌కుమార్‌ నిర్మించారు. దర్శకుడు మారుతి సమర్పకుడు. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ‘శివసాయి సినిమాను డీల్‌ చేసే విధానం అద్భుతంగా ఉంది. నిర్మాత కిరణ్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంతో సపోర్ట్‌ చేశారు. మారుతితో పనిచేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం ఇది’ అన్నారు. ‘వినాయకచవితి రోజున సినిమాను విడుదల చేస్తున్నాం. పొద్దున్నే పూజ చేసుకుని సాయంత్రం సినిమాకి వచ్చేయండి’ అని కోరారు దర్శకుడు శివసాయి. మంచి సినిమా చూశామనే నమ్మకం ఉందనీ, అందరికీ నచ్చుతుందని నిర్మాత కిరణ్‌కుమార్‌ చెప్పారు.

Updated Date - Aug 28 , 2024 | 02:35 AM