హృదయాలను గెలుచుకునే చిత్రం

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:07 AM

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్న సర్వైవ ల్‌ థ్రిల్లర్‌ ‘గోట్‌ లైఫ్‌’ (మలయాళంలో ‘ఆడు జీవితం). హాలీవుడ్‌ నటుడు జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌, కే ఆర్‌ గోకుల్‌ ప్రధాన తారాగణం....

హృదయాలను గెలుచుకునే చిత్రం

మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్న సర్వైవ ల్‌ థ్రిల్లర్‌ ‘గోట్‌ లైఫ్‌’ (మలయాళంలో ‘ఆడు జీవితం). హాలీవుడ్‌ నటుడు జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌, కే ఆర్‌ గోకుల్‌ ప్రధాన తారాగణం. బెన్యామిన్‌ రాసిన ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించారు. విజువల్‌ రొమాన్స్‌ బేనర్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను చిత్రబృందం బుధవారం ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘‘గోట్‌లైఫ్‌’ చిత్రం ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ఈ చిత్రం వరల్డ్‌ క్లాసిక్‌ మూవీ ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’ స్థాయిలో ఉండబోతోంది. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. పూర్తిగా ఎడారి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 10న మలయాళం, తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సునీల్‌ కేఎస్‌

Updated Date - Feb 29 , 2024 | 05:07 AM