Dakkan Sarkar : ఉద్యమ నేపథ్యం
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:57 AM
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘దక్కన్ సర్కార్’. కళా శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘దక్కన్ సర్కార్’. కళా శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రబృందం టీజర్ విడుదల చేసి, పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కళా శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘దక్కన్ సర్కార్’ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని వెండితెరపైన ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. పోరాటాలకు విరామం ఉండదని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం. త్వరలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.