కొత్తదనంతో నిండిన చిత్రం

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:16 AM

‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారులోకంతో’ లవర్‌ బాయ్‌, పక్కింటి కుర్రాడి ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు వరుణ్‌ సందేశ్‌. తనకున్న ఆ ఇమేజ్‌కి భిన్నంగా ఆయన పూర్తి సీరియస్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అనేది...

కొత్తదనంతో నిండిన చిత్రం

‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారులోకంతో’ లవర్‌ బాయ్‌, పక్కింటి కుర్రాడి ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు వరుణ్‌ సందేశ్‌. తనకున్న ఆ ఇమేజ్‌కి భిన్నంగా ఆయన పూర్తి సీరియస్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అనేది ఉప శీర్షిక. రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్‌ సందేశ్‌ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.


‘‘నేనిప్పటివరకూ ఇటువంటి పాత్రను చేయలేదు. నిజజీవితంలో ఎంతో చలాకీగా, నవ్వుతూ కనిపించే నేను.. ఇందులో చాలా సీరియస్‌గా ఉంటాను. ఒక నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించిన చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేద్దామనుకొంటున్న సమయంలో ఈ కథ విన్నా. చాలా నచ్చింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ సినిమా కథను చాలా పకడ్బందీగా రాసుకున్నారు డైరెక్టర్‌ రాజేశ్‌ జగన్నాథం. సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌లలో చాలా కథలు వచ్చాయి. కానీ వాటన్నికంటే పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కొత్తదనంతో నిండిన ఈ చిత్రంలో స్ర్కీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరు’’ అని చెప్పారు.

Updated Date - Jun 19 , 2024 | 04:16 AM