ఫైటర్‌ హంగామా

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:09 AM

హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 25న విడుదలవుతోంది. 2019 నాటి పుల్వామా ఘటన నేపథ్యంలో....

ఫైటర్‌ హంగామా

హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 25న విడుదలవుతోంది. 2019 నాటి పుల్వామా ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా చిత్రబృందం ‘ఫైటర్‌’ ట్రైలర్‌ను విడుదల చేసింది. దేశభక్తి, యాక్షన్‌, ఎమోషన్‌ అంశాల కలబోతగా చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో హృతిక్‌ పాత్రను షంషేర్‌ పఠానియాగా పరిచయం చేశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌ డ్రాగన్స్‌ అనే విభాగానికి ఆయన లీడర్‌గా కనిపించారు. ఎయిర్‌ఫోర్స్‌ యూనిఫాంలో హృతిక్‌ ఆకట్టుకున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 06:09 AM