ఉత్సవంలా సాగే పాట
ABN , Publish Date - Sep 27 , 2024 | 02:10 AM
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాణీ కథానాయిక. దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని ఈ నెల 30న విడుదల...
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాణీ కథానాయిక. దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రెండో గీతాన్ని ఈ నెల 30న విడుదల చేయనున్నారు. గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శంకర్, సంగీత దర్శకుడు తమన్ ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. శంకర్ మాట్లాడుతూ ‘ఈ పాట చిత్రీకరణ కోసం చాలా పరిశోఽథన చేశాం. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన నృత్యరీతులను పాటలో భాగం చేశాం. ఒక ఉత్సవంలా ఈ పాట సాగుతుంది. రామ్‌చరణ్ అద్భుతంగా నర్తించారు’ అని చెప్పారు. తమన్ మాట్లాడుతూ ‘‘రా మచ్చా... పాటలో విభిన్న సంస్కృతులను చూపించబోతున్నాం. పాటను తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు.