తండ్రీ కూతుళ్ల కథ

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:35 AM

రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో సాయి రోనక్‌, ప్రగ్యా నాగ్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లగ్గం’. నిర్మాత వేణుగోపాల్‌ రెడ్డి. నేపథ్య సంగీతం మణిశర్మ. ఈ శుక్రవారం విడుదలవుతోంది...

రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో సాయి రోనక్‌, ప్రగ్యా నాగ్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లగ్గం’. నిర్మాత వేణుగోపాల్‌ రెడ్డి. నేపథ్య సంగీతం మణిశర్మ. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘లగ్గం చిత్రం ఒక తండ్రీ కూతుళ్ల కథ. ఈ చిత్రంలో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్ణం’ అని అన్నారు. ‘ఎంతో మంది కలిసి పనిచేస్తేనే ఒక సినిమా పూర్తవుతుంది. లగ్గం చిత్రంతో ఒక మంచి మెసేజ్‌ని అందంగా చెప్పాలని అనుకున్నాం’ అని చిత్ర నిర్మాత వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ‘ఈ సినిమా అరిటాకులో వడ్డించిన విందు భోజనంలా ఉంటుంది’ అని దర్శకుడు రమేశ్‌ చెప్పాల తెలిపారు.

Updated Date - Oct 24 , 2024 | 05:35 AM