ఓ రైతు భావోద్వేగ ప్రయాణం
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:55 AM
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో దయా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘బాపు’. రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, అవసరాల శ్రీనివాస్....
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో దయా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘బాపు’. రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, అవసరాల శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. హాయిగా డైనింగ్ చైర్‌లో కూర్చున్న ఓ తండ్రి చుట్టూ ఒక కుటుంబం గుమిగూడి, అతనికి ఇష్టమైన వంటకాలను వడ్డించడం పోస్టర్‌లో కనిపిస్తోంది. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతోన్న ఓ రైతు భావోద్వేగ ప్రయాణం ఈ చిత్ర కథ అని మేకర్స్ తెలిపారు.