ఓ అభిమాని కోరిక
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:37 AM
సినీ పాత్రికేయుడు, నటుడు సురేశ్ కొండేటి కథానాయకుడిగా ‘అభిమాని’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఓ అభిమాని కోరిక’ అనేది ట్యాగ్‌లైన్. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో...
సినీ పాత్రికేయుడు, నటుడు సురేశ్ కొండేటి కథానాయకుడిగా ‘అభిమాని’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఓ అభిమాని కోరిక’ అనేది ట్యాగ్‌లైన్. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో ఎస్‌కే రహ్మన్, కంద సాంబశివరావు నిర్మిస్తున్నారు. శనివారం దర్శకుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల చేశారు. యమలోకం నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. సంగీతం: డ్రమ్స్ రాము.